తనను దూరం పెడుతున్నాడని.. ప్రియుడిపై ప్రియురాలు తుపాకీ కాల్పులు

తనను దూరం పెడుతున్నాడని అనుకుందో ఏమో.. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తినే తుపాకీతో కాల్చింది ఓ యువతి. బెంగాల్ రాష్ట్రం బర్థమాన్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగంకోసం జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లిన యువతి ఇటీవల సొంతూరుకు తిరిగి వచ్చింది. రావడంతోనే తాను ప్రేమించిన యువకడిని కలవాలని అనుకుంది. దీంతో స్థానికంగా ఉన్న సర్కస్ మైదానానికి రమ్మని కోరింది. అక్కడకు చేరుకున్న తరువాత కాసేపు బాగానే ఉన్న యువతి తను వెంట తెచ్చుకున్న తుపాకీతో ప్రియుడిని కాల్చింది. ఈ ఘటన బుధవారం రాత్రి కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్లుగా కలిసి ఉంటున్న తమ బంధాన్ని పట్టించుకోకుండా… తనను దూరంపెడుతున్నాడనే ఉద్దేశ్యంతోనే యువతి కాల్పులకు తెగబడిందని తెలుస్తోంది.

కాగా తుపాకీతో కాల్చడం వల్ల బుల్లెట్ పొట్ట కింది భాగం నుంచి వెళ్లడంతో ప్రియుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తను రమ్మనగానే నేను వెళ్లానని.. నన్ను కౌగిలించుకుని ముద్దు కూడా పెట్టిందదని.. ఇద్దరం కలిసి సిగరేట్ కూడా తాగామని.. ఎదైదో ఏమో హఠాత్తుగా తుపాకీతో కాల్చిందని యువకుడు చెబుతున్నాడు. కాల్పుల అనంతరం యువతి అక్కడ నుంచి వెళ్లిందని.. ఆ తరువాత అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. యువతి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.