720 రూపాయల కోసం వ్యక్తి దారుణ హత్య !

Join Our Community
follow manalokam on social media

హయత్ నగర్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హయత్ నగర్ లోని డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. బండ రాయితో మోదీ గుర్తు తెలియని యువకులు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేయగా ముగ్గురు యువకులు హత్య చేసినట్లు గుర్తించారు. కేవలం 720రూపాయల కోసం పండ్లు వ్యాపారి మధుసుధన్‌రెడ్డి ని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. మద్యం కొనుగోలులో 720 రూపాయల వివాదమే హత్యకు కారణంగా గుర్తించారు. నిందితులు సందీప్ రెడ్డి, ఉదయ్ కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.

murder
murder

ఓ బెల్ట్ షాప్ వద్ద ముగ్గురు యువకులకు చెందిన గూగుల్ పే పని చేయకపోవడం తో మధుసూదన్ డబ్బు సహాయం చేశారు. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తామని మధుసూదన్ ను వెంట తీసుకువెళ్లిన యువకులు కొద్ది దూరం వెళ్ళాక మధుసూదన్ తో వాగ్వివాదానికి దిగారు. మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ బండ రాయితో మోది యువకులు దారుణంగా హత్య చేశారు. 720 రూపాయలు అప్పుగా ఇచ్చినందుకే పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజ్ సహాయంతో కేసును  చేధించారు పోలీసులు..

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...