మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి మృతి

-

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు బ‌ప్పి ల‌హిరి(69) తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ముంబైలోని ఓ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఆసుప్ర‌తిలోనే మృతి చెందిన‌ట్టు వైద్యులు వెల్ల‌డించారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని జ‌ల్‌పాయ్ గుడిలో జ‌న్మించిన ఆయ‌న ఎన్నో భాష‌ల్లో పాట‌లు పాడారు.

ముఖ్యంగా హీందీ చిత్రాల‌తో పాటు తెలుగులో కూడా ప‌లు చిత్రాల‌కు బ‌ప్పీ ల‌హిరి సంగీతం అందించారు. సింహాసనం, సామ్రాట్‌, స్టేట్‌రౌడి, గ్యాంగ్‌లీడ‌ర్ వంటి చిత్రాల‌కు సంగీతాన్ని అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news