రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ శ్రీ రామ నగరంలో సమతా మూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 12 రోజుల పాటు సమతా మూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు. కాగ ఈ ఉత్సవాలు ముగియడంతో నేటి నుంచి సామాన్యులకు సమతా మూర్తి దర్శనం ఇవ్వనున్నారు. కానీ.. రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి నిర్వహకులు అనుమతి ఇవ్వనున్నారు. సాధారణ ప్రవేశ్ రుసంతో దర్శనం ఉంటుందని నిర్వహకులు తెలిపారు.
కాగ ఇటీవల జరిగిన సహస్రాబ్ది ఉత్సవాలు 24 గంటలు ప్రవేశానికి అనుమతి ఉండేది. కానీ ప్రస్తుతం రోజుకు నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని నిర్వహకులు తెలిపారు. అలాగే ఈ నెల 19వ తేదీన 108 ఆలయాల్లో జరగబోయే.. కళ్యాణ మహోత్సవం వరకు సువర్ణ మూర్తి విగ్రహంతో పాటు త్రీడీ షోలను కూడా తాత్కాళికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. కాగ సమతా మూర్తిని సందర్శించు కోవాలని అనుకునే వారు… ఆయా సమయాల్లోనే వెళ్లాలి.