షుగర్ ఉన్నవారు బీట్‌రూట్ తినొచ్చా!.. ఈ 4 సమస్యలకి చక్కటి పరిష్కామట..!.

-

బీట్ రూట్ ఇతర దుంపల్లో కంటే..చాలా ఔషధగుణాలు ఉన్న దుంప. ఇందులో ఐరన్, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది హెల్త్ కే కాదు..అందానికి కూడా బాగా పనికొస్తుంది. జుట్టుకు మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు బీట్‌రూట్‌ మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. బీట్‌రూట్ రుచి కాస్త తియ్యగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు తినాలా వద్దా అని సందేహంలో ఉంటారు. వైద్కులు కూడా వీరిని అధికంగా తినొద్దు అంటారు..తప్ప అసలకే మానేయమనరు..కానీ డయబెటీస్ భయంతో మొత్తం దుంప జాతీనే తినటం మానేస్తారు. కానీ వారు బీట్ రూట్, చామదుంప తినొచ్చు. బీట్‌రూట్‌ తింటే ముఖ్యంగా వీరికి నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది

బీట్‌రూట్ సహజ చక్కెరను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మీ శరీరానికి హాని కలిగించదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తినడానికి ముందు బీట్‌రూట్ తీసుకోవాలి. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాక శక్తిని ఎక్కువగా అందిస్తుంది. పేషెంట్లు హుషారుగా ఉంటారు.

అధిక రక్తపోటును తగ్గిస్తుంది

డయాబెటీస్‌ పేషెంట్లు తరచుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. బీట్‌రూట్ తినడం లేదా దాని రసం తాగడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఉదర సమస్యల నుంచి ఉపశమనం

డయాబెటిక్ రోగులు భోజనానికి ముందు బీట్‌రూట్ తింటే..శరీరానికి సహజ చక్కెర లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఇతర వ్యాధుల నుంచి రక్షణ

మధుమేహం భారతదేశంలో ఒక సాధారణ సమస్యగా మారింది. కానీ ఇది స్లోపాయిజన్ ..మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్యమైన అవయవాలను షుగర్ ప్రభావితం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బీట్‌రూట్‌ను తింటే మధుమేహం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.
అయితే మితంగానే బీట్ రూట్ తినాలి. అధిక పరిమాణంలో తీసుకుంటేనే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news