గోల్కొండలో బతుకమ్మ ఆడిన ముస్లిం యువతులు

-

గోల్కొండ కోటలో అంగన్వాడీ టీచర్లు, సీఆర్పీఎఫ్ మహిళా సిబ్బందితో కలిసి పలువురు ముస్లిం యువతులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా అంటూ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కాగా ముస్లిం యువతులు సైతం బతుకమ్మ ఆడగా పలువురు వారిని అభినందించారు. అంతా సమానమని చాటి చెప్పామన్నారు.

ఇదిలా ఉంటే.. దీప్తి మామిడి ఆధ్వర్యంలో ‘మన బతుకమ్మ సంబురాలు’ను హైటెక్స్ దగ్గర‌లోని మైదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా నిర్వహిచారు. ఈ బతుకమ్మ వేడుకలలో పలువురు పేజి3 సెలబ్రిటీలు మరియు టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఇందులో భాగంగా దండియా, బతుకమ్మ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. హాజరైన వారంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్న నిర్వహకులు దీప్తి మామిడి మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలను మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. మేమంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుoటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news