ఇజ్రాయెల్ దాడిలో 2,750 మంది మృతి

-

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరుకుంది. తమపై దాడి చేసిన గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం ప్రకటించింది. దీంతో గాజా నగరం కుప్పకూలుతోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 2,750 మంది ప్రాణాలు కోల్పోయారని, 9,700 మంది గాయాలపాలయ్యారని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Israel Forms Unity Government as Hamas Armed Wing Says Still Fighting  Outside Gaza

ఈ దాడుల నేపథ్యంలో కొంతమందిని కాపాడినట్లు పాలస్తీనా పౌర రక్షణ బృందం తెలిపింది. శిథిలాల కింద వెయ్యి మందికి వరకు ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడం ఇబ్బందికరంగా మారిందని, అలాగే ఉంచితే కుళ్లిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. మొదట్లో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడి చేస్తోంది. దీంతో గాజాపై ఇజ్రాయెల్ దాడి ఆపేస్తే బందీలను విడుదల చేస్తామని హమాస్ టెర్రరిస్టులు చెప్పినట్లుగా ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే హమాస్ మిలిటెంట్లు దీనిని ధృవీకరించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news