నందమూరి అభిమానులకు శుభవార్త. నందమూరి తారకరామారావు వారి భార్య పేరు మీద కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ ను రిమోడెల్ చేసి మళ్లీ ప్రారంభించారు. ఇది కూడా వారి బిడ్డ అయిన నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషం.
సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ తారకరామ థియేటర్ కు ఓ చరిత్ర ఉంది. ఈ థియేటర్ మాకు దేవాలయంతో సమానం. అమ్మానాన్నల పేర్లు కలిసి వచ్చేలా ఈ థియేటర్ ను మేము 1978లో ప్రారంభించాం. ఎన్నో సినిమాలు వంద రోజులు , రెండొందల రోజులు ఆడాయి.కొన్ని ఇబ్బందుల వల్ల మూత బడిన ఈ థియేటర్ ను తిరిగి 1995 లో పునఃప్రారంభించాం. నేటి టెక్నాలజీకి అనుగుణంగా అధునాతన హంగులతో ఇప్పుడు మూడోసారి అందుబాటులోకి తీసుకువచ్చాం.
ఈ థియేటర్ తో నాకు సెంటిమెంట్ కూడా ఉంది. ఎందుకంటే మా అబ్బాయి తారకరామ తేజ పేరును నాన్న ఈ థియేటర్లోనే పెట్టారు. ఏషియన్ సంస్థతో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్లతో కలిసి ఈ ఏషియన్ తారకరామ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావడం అనందంగా ఉంది. మళ్లీ థియేటర్లు ప్రేక్షకుల తో కళకళ లాడలని కోరుకుంటున్నా అని అన్నారు.