దీపావళికి ఇలా ఈజీగా మైసూర్ పాక్ తయారు చేసేయండి..!

దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరు దీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు.

ఎప్పటి నుండో మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాము. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. అయితే చాలా మందికి దీని అర్ధం ఏమిటి అనేది తెలీదు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం. అందుకే ఈ పేరు వచ్చింది. ఇక దీపావళి నాడు రుచికరమైన మైసూర్ పాక్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం.

మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్దాలు:

శనగపిండి – 2 కప్పులు
నెయ్యి – 2 కప్పులు
చక్కెర – 2 కప్పులు

మైసూర్ పాక్ ని తయారు చేసే విధానం:

దీని కోసం ముందు శనగపిండిని తీసుకుని జల్లించండి.
తరవాత స్టౌవ్ మీద ఓ పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి శనగ పిండిని రంగు మారే దాకా వేయించుకోండి.
ఇప్పుడు ఓ గిన్నెలో నీళ్లు వెయ్యండి. ఆ తరవాత చక్కెరను వేసి పాకం వచ్చేంత వరకు ఉంచండి.
ఇప్పుడు మీరు శనగ పిండి వేసి గట్టి పడే వరకు కలపాలి. ఆయితే పిండి మాత్రం ఉండలు లేకుండా చూసుకోండి. లేకపోతే మైసూర్ పాక్ బాగోదు.
తరవాత ఇప్పుడు నెయ్యి వేసి మళ్ళీ కలుపుకుని ముక్కలుగా కట్ చెయ్యండి. తరవాత దీన్ని ఆరనివ్వాలి అంతే.