జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్ చెప్పింది నాబార్డ్. ఆసుపత్రుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.1392.23 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన “జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్సాంకు” (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్”—నాబార్డ్). వైఎస్ఆర్ కడప, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నిర్మాణానికి ఈ నిధులను వినియోగించాలని నాబార్డ్ సూచనల చేసింది.
ఈ కొత్త వైద్య సంస్థల్లో ప్రధాన ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), డయాలసిస్, బర్న్ వార్డులు, క్యాజువాలిటీ వార్డులు, ప్రత్యేకమైన క్లినికల్-కమ్-సర్జికల్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లు ఉంటాయి.
శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కన్సల్టేషన్ రూమ్‌లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్‌మెంట్ ప్రొసీజర్ రూమ్‌లు, డయాలసిస్ వార్డులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్ (ఓటీ) కాంప్లెక్స్, ఓపీడీ, సాధారణ/పీడియాట్రిక్/ఆర్థోపెడిక్ వార్డులు మొదలైనవి ఏర్పాటు చేయబడతాయి. “నాడు-నేడు” కార్యక్రమం కింద పాఠశాలల ఆధునీకరణ కోసం ఇప్పటివరకు రూ.3,092 కోట్లు మంజూరు చేసింది “నాబార్డ్”. ఈ నిధులతో 25,648 పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంతోపాటు మరుగుదొడ్లు, తాగునీరు వసతులు ఏర్పాటు చేయబడ్డాయి.