గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారు.. కొడాలి నానిపై మేం చేసిన ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. ప్రభుత్వ పరువు పోయిందని భయపడి.. మమ్మల్ని తిడుతున్నారని.. మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారని గుర్తు చేశారు. మంత్రి కొడాలి నాని సవాలును స్వీకరిస్తున్నాము..మేము నిరూపించడానికి సిద్ధమని పేర్కొన్నారు.
ఒక వేళ నిరూపించలేకపోతే పెట్రోల్ తో నేను తగల బెట్టుకుంటానని సవాల్ విసిరారు. లేకపోతే నీవు పెట్రోల్ తో తగల బెట్టుకోవాలన్నారు.దీనిపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని… క్యాసినో వ్యవహరంపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఎందుకు స్పందించడం లేదు..? మాపై దాడులు చేస్తే భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పక్కా ప్రణాళికతో మాపై దాడి జరిగింది.. చంపాలని చూశారని… నిన్న మా ప్రాణాలు తీయాలని చూసారు.. కుదరలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఐజీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని.. టిడిపి నిజ నిర్దారణ కమిటీ వెళితే ప్రభుత్వం ఉలిక్కి పడిందన్నారు. ఏమి జరగకపోతే మమ్మల్ని కన్వెన్షనుకు తీసుకెళ్లి చూపించాలన్నారు.