ప్రముఖ తెలుగు కథానయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్లో తనను విలన్ గా చూపిస్తే మాత్రం కోర్టును ఆశ్రయిస్తానని ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు చిత్ర యూనిట్ ని హెచ్చరించారు. నాటి తెదేపా ప్రభుత్వం గురించి కొన్ని సన్నివేశాలు ఆ సినామాలో ఉండటంతో సినిమాలో తన పాత్రను ఎలా చిత్రీకరించారో తెలపాలని, తనను విలన్‌గా చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. అయితే దీనిపై ఇప్పటికే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డుకు ముందస్తుగా లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రను తప్పుగా చిత్రీకరించినట్లు ఓ వ్యక్తి ద్వారా తెలిసిందని, ఈ విషయం నచ్చకే మొదటి దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు ఆయన వ్యూహ రచనల గురించి వివరిస్తూ…చిత్రన్ని తెరకెక్కించనున్న నేపథ్యంలో నాదెండ్ల విషయం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీని బెజవాడ పాపిరెడ్డి సహా 20 మందితో కలిసి తానే స్థాపించానని, ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గతంలో ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ గురించి పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలుసుకోవాలంటే తాను రాసిన పుస్తకం చదవాలని సూచించారు. చరిత్రను వక్రీకరిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు