స్టార్ హీరోల లక్సరీ లైఫ్ గురించి అందరికి తెలిసిందే. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు రాబడిలో 20 శాతం తమ మెయింటెనన్స్ కోసమే ఖర్చు చేస్తారు. ఇది అందరికి తెలిసిందే. స్టార్ హీరో పెట్టుకునే గాగుల్స్ బ్రాండ్ దగ్గర నుండి క్లాతింగ్ షూస్ ఇలా అన్నిటి మీద మీడియా కన్ను ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు పెట్టుకునే వాచ్ మీద మరింత ఫోకస్ పెడతారు.
ఈ క్రమంలో లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతికి ఉన్న వాచ్ చూసి అబ్బో అబ్బబ్బో అనేస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ మ్యారేజ్ కు జైపూర్ వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు చరణ్, ఎన్.టి.ఆర్, రానా. ముగ్గురి డ్రెసింగ్ స్టైల్ అదిరిపోయింది. అయితే బాగా అబ్సర్వ్ చేస్తే ఎన్.టి.ఆర్ పెట్టుకున్న వాచ్ మాత్రం అదిరిపోయింది. అది అలాంటి ఇలాంటి వాచ్ కాదు అక్షరాల 2 కోట్లకు అటు ఇటుగా ఉండే వాచ్ అది.
రిచర్డ్ మిల్ బ్రాండ్ నుండి వచ్చిన ఆర్.ఎం 11-3 మెక్ లారెన్ ఆటోమెటిక్ ఫ్లై బ్యాక్ క్రోనోగ్రాఫ్ వాచ్ అది. అలా వాచ్ చూశారో లేదో దాని వివరాలు చూసి అందరు షాక్ అవుతున్నారు. స్టార్ హీరోలు తమ వాచ్ లకు చాలా పెద్ద మొత్తం వెచ్చిస్తారు. దాదాపు అందరు స్టార్స్ కోటిన్నర నుండి 2 కోట్ల వరకు ఉన్న వాచ్ లను వాడుతున్నారట. దీన్ని బట్టి చూస్తే వారు టైం కు ఎంత వాల్యూ ఇస్తున్నారో తెలుస్తుంది.