జనసేన రాజకీయం ఎప్పుడు ఎలా ? మారుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ పార్టీ అధినేత ఇప్పుడు ఏం మాట్లాడుతారు… అసలు ఆ పార్టీ పొలిటికల్ రూటు ఎలా ఉంటుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే జనసేన లో పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీ వ్యవహారాలను అన్నింటిని దగ్గరుండి చూసుకుంటారు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకరుగా పనిచేశారు.
ఆయనకు రాజకీయ మేధావి అన్న పేరు కూడా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్, జనసేన నుంచి తెనాలిలో పోటీ చేసి ఓడిపోయారు. మనోహర్ తాను ఏ పని చేసినా పనిచేసిన చాలా సైలెంట్ గా చేసుకుపోతారన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే పవన్ నాదేండ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. పవన్ పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనోహర్‌కు తెలియకుండా తీసుకోరన్న పేరు కూడా ఉంది.
ఇక మనోహర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కూడా పవన్ ఆ కోణంలో కూడా ఆయన్ను చాలా సార్లు ముందు పెడుతూ రాజకీయం చేస్తారు. అయితే ఇదే ఇప్పుడు జనసేనలో చాలా మందికి కంట గింపుగా మారిందంటున్నారు. పవన్ లేనప్పుడు మనోహర్ చెప్పినట్టు చేయాల్సి వస్తోందని ఓ సామాజికవర్గానికి చెందిన నేతలు ఫైర్ అవుతున్నట్టు టాక్..!
జనసేనలో ఓ సామాజికవర్గం నాయకులు, నేతల హంగామా, ఆధిపత్యం ఎక్కువ. దీంతో వారంతా సహజంగానే మనోహర్‌ను లైక్ చేయడం లేదు. వీరంతా ఇటీవల తమ బాధను పవన్‌కు చెప్పినా పట్టించు కోడని నాగబాబును కలిసి.. ఆయనకు చెప్పినట్టు తెలుస్తోంది. నాగబాబు కూడా ఇలాంటి విషయాలకు పెద్దగా ప్రయార్టీ ఇవ్వవద్దని చెప్పారట. అయినా ఆ నేతలు మాత్రం మనోహర్‌ను ఎలా ? బయటకు పంపాలా ? లేదా ఆయన ఎప్పుడు బయటకు వెళతారా ? అని వెయిట్ చేస్తున్నారట.