గన్నవరం నుంచి అవినాష్… వంశీకి ఎమ్మెల్సి…?

-

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన గురువారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని విజయవాడ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. టీడీపీ ఇసుక దీక్ష కు ముందే పార్టీకి అవినాష్ గుడ్ బాయ్ చెప్పే సూచనలు కనపడుతున్నాయి. గుణదలలోని స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయిన అవినాష్… ఈ మేరకు వారి అభిప్రాయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఈ సమావేశంలో వైసీపీ లోకి వెళ్లాలని అవినాష్ కు సూచించిన దేవినేని నెహ్రూ అభిమానులు అంటూ భారీగా వార్తలు వస్తున్నాయి. నెహ్రూ అభిమానులకు పార్టీ లో గుర్తింపు లేదని వారు అవినాష్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసారట. వైసీపీ లోకి వెళ్లాలని అవినాష్ కి సూచించడంతో పార్టీ మారేందుకు అవినాష్ సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేచింది. గన్నవరం నుంచి అవినాష్ కి సీటు ఇవ్వడానికి జగన్ అంగీకరించారని ప్రచారం జరుగుతుంది.

అక్కడ జరగబోయే ఉప ఎన్నిక ఖర్చు మొత్తం,పార్టీ భరిస్తుందని జగన్ ఆయనకు స్పష్టం చేయడం, వంశీకి ఎమ్మెల్సి ఇస్తున్నామని చెప్పడంతోనే అవినాష్ పార్టీ మారేందుకు సిద్దమయ్యారట. గన్నవరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, వంశీ వర్గం నుంచి ఎలాంటి సమస్యలు రావని, యార్లగడ్డ వెంకట్రావు వర్గం కలిసి పని చేస్తుందని అవినాష్ కి ఇప్పటికే పార్టీ సీనియర్లు హామీ ఇచ్చారట. అందుకే వంశీ కూడా ఇన్నాళ్ళు పార్టీ మారకుండా వేచి చూస్తున్నారని, ఆయన ఇందుకు అంగీకరించడం లేదని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news