పవన్‌కు సపోర్ట్‌గా నాగబాబు..మళ్ళీ స్టార్ట్?

-

మెగా బ్రదర్ నాగబాబు మళ్ళీ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు..తన సోదరుడు..జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అండగా నాగబాబు ముందుకెళుతున్నారు…అలాగే అధికార వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా నాగబాబు ఇంతకంటే ఎక్కువగానే చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

2019 ఎన్నికల ముందు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై సెటైర్లు వేశారు…అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. ఇక రాజకీయంగా పవన్ కు అండగా ఉంటూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన తరుపున నిలబడి నాగబాబు ఓడిపోయిన విషయం తెలిసిందే. నరసాపురం ఎంపీగా పోటీ చేసి దాదాపు రెండున్నర లక్షల వరకు ఓట్లు తెచ్చుకున్నారు.

ఇక ఎన్నికల తర్వాత నాగబాబు రాజకీయాల్లో కనిపించలేదు. అప్పుడప్పుడు తన మార్క్ పంచ్ లతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు గాని…ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగలేదు. అలాగే ‘మా’ ఎన్నికల్లో కాస్త హడావిడి చేస్తూ కనిపించారు. అయితే ఈ మధ్య కాలంలో నాగబాబు జనసేనలో ఎక్కువ వినిపిస్తున్నారు. పవన్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.

తాజాగా కూడా నాగబాబు సోషల్ మీడియా వేదికగా…గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన పోస్టుని గుర్తు చేస్తూ…నాగబాబు పంచ్ వేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి..’సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్టులు, వేధింపులు ఆపండి..మీ పాలనకు సిగ్గుచేటు అని జగన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అదే ట్వీట్ ని చూపించి..అప్పుడు మిమ్మల్ని వేధించినదే…ఇప్పుడు మీరు అధికారంలో ఉంటూ..సామాన్య ప్రజలని ఎలా వెంటాడుతున్నారు…మేలుకో సీఎం…కనీసం ఇప్పుడైనా ఆపు అని చెప్పి…వైసీపీ ప్రభుత్వ అక్రమ అరెస్టులపై నాగబాబు గళం విప్పారు. మొత్తానికి నాగబాబు మళ్ళీ దూకుడుగా రాజకీయం చేస్తూ..పవన్ కు అండగా ఉంటూ వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news