నాగశౌర్య ” కృష్ణ వ్రింద విహారి” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

యువ నటుడు నాగశౌర్య తాజా చిత్రం” కృష్ణ వ్రింద విహారి”. హనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షేర్లీ సేటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పురి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీ గా తిరిగెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి రాధిక కీలకపాత్ర పోషించారు.

వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ, సత్య, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర సంగీతంం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ డేటును వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news