మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ఒక్కోసారి మనకి పర్సనల్ లోన్స్ అవసరం అవుతుంటాయి. అయితే దీనిని పొందేందుకు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే అలాంటి సమయంలో పాన్ కార్డును ఉపయోగించుకోవచ్చు.
పూర్తి వివరాలను చూస్తే.. పాన్ కార్డు కష్టాలప్పుడు మనల్ని గట్టెకించేస్తుంది. పాన్ కార్డ్ సహాయంతో రూ.50,000 వరకు లోన్ ని తీసుకోచ్చు. చాలా బ్యాంకులు పాన్ కార్డు ద్వారా లోన్స్ ఇస్తున్నాయి. పాన్ సహాయంతో బ్యాంకులు లేదా NBFCలు లోన్స్ ని ఇస్తుంటాయి. ఇది మీ సిబిల్ స్కోర్ ఆధారంగా ఉంటుంది.
మంచి క్రెడిట్ హిస్టరీ రికార్డు ఉంటే సిబిల్ స్కోర్ బాగుంటుంది. పాన్ కార్డ్ సహాయంతో మంచి సిబిల్ స్కోర్ ఉంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రూ.50,000 వరకు లోన్ ని బ్యాంకులు ఇస్తాయి. ఇలా ఇచ్చేవి అన్ సెక్యూర్డ్ లోన్ కేటగిరీ కిందకొస్తాయి.
లోన్ కోసం ఇవి చాలా ముఖ్యం:
కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవాళ్లే లోన్ కి అర్హులు.
కంపెనీలో పని చేసినా లేదా మీ స్వంత వ్యాపారం చేసినా మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. అప్పుడే లోన్ ఇస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ పక్కా.