Cheetahs : 74ఏళ్ల తర్వాత భారత్‌లోకి చీతాలు

-

1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్‌ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన మోదీ సర్కార్ ఇప్పుడు విదేశాల నుంచి చీతాలను తీసుకురాబోతున్నాయి.

సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి రాబోతున్నాయి. ప్రత్యేక బోయింగ్‌ విమానంలో 16 గంటలు ప్రయాణించి ఇండియాలో అడుగుపెట్టనున్నాయి. వీటి తరలింపు కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విమానం బి747 జంబోజెట్‌ అయిదు ఆడ, మూడు మగ చీతాలతో నమీబియాలోని విండ్‌హోక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి జైపుర్‌లో దిగనుంది.

అక్కడి నుంచి హెలీక్యాప్టర్లలో మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు. నాలుగు నుంచి ఆరేళ్ల మధ్య వయసు గల ఈ చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కునో పార్కులోకి విడిచిపెడతారు.

Read more RELATED
Recommended to you

Latest news