నజ్రియా టాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఆ తప్పేనా..?

-

పుష్ప సినిమాతో ఊహించని స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్నారు ఫహద్ ఫాజిల్. పుష్ప సినిమా సక్సెస్ కావడానికి ఈ హీరో నటన కూడా ఒక కారణమని చెప్పవచ్చు. నటించింది కేవలం కొన్ని నిమిషాలైనా తన నటన తో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఫహద్ ఫాజిల్. ఇక రీసెంట్గా విడుదలైన విక్రమ్ సినిమాతో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు . ఇక ఈ నటుడి భార్య నజ్రియా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. అంటే సుందరానికి చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ఈ చిత్రంతో సంబంధం లేకుండా ఈమెకు తెలుగులో అవకాశాలు వెలువబడుతున్నట్లు సమాచారం.

అయితే ఈమె ఎలాంటి ఆఫర్ కి ఒప్పుకోలేదు అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఫాహధ్ ఫా జిల్ తెలుగులో సక్సెస్ కావడానికి తన భార్య నజ్రియా సక్సెస్ కాలేకపోవడానికి ముఖ్యమైన కారణం ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నజ్రియాకు తెలుగులో ఆఫర్లు రావడం కొత్తేమీ కాదు.. గతంలో 2014 వ సంవత్సరంలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా.. ఆ పాత్రలో అన్ని సెకండ్ హీరోయిన్స్ కావడంతో ఈమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడం జరిగినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

అయితే అప్పట్లో నజ్రియా ముఖంలో ఉండే గ్లో.. ఇప్పుడు లేదని అందుకే నజ్రియా నటించిన సినిమాలకు ఇదే మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. ఫాహద్ ఫాజిల్ మాత్రం పాత్రకు అనుగుణంగానే తన లుక్స్ ను మారుస్తూ ఉంటారని తెలుగు ప్రేక్షకులకు దీనివల్లనే దగ్గరయ్యారని తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో తన కెరీర్ ని మొదలుపెట్టి మంచి విజయ దిశగా దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news