నందమూరి బాలకృష్ణ వయస్సు పెరుగుతున్నా కూడా ఇంకా యువకుడి గానే చలాకీగా నటిస్తున్నారు. ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఫైట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు.ఇందులో ఫైట్స్ లో బాలయ్య అఖండ ను మించిన ఎనర్జీ తో చేశారని అంటున్నారు.ఇక నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. ఇక ఇందులో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను , మరో ముఖ్య పాత్ర కోసం శ్రీ లీల ను ఎంచుకున్నారట. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.వాస్తవానికి ముందు వచ్చిన సమచారం ప్రకారం అనిల్ సినిమా ను జనవరి నెలలో మొదలు పెడతారని అనుకున్నారు.ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారం అందరు హీరోలు ఒక సినిమా పూర్తి అయితే కనీసం ఒక నెల రోజులు ఇతర దేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకోని ఎంజాయ్ చేసి వస్తారు. కాని మన బాలయ్య బాబు, రెస్ట్ లేదు గిస్ట్ లేదు షూటింగ్ స్టార్ట్ చేయడమే అని ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది విని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆశ్చర్యం తో నోరు తెరిచాడట. అట్లుంటది బాలయ్య తో వ్యవహారం అంటే దబిడి దిభిడే..