డిజిటల్ లో భారీ రేటు పలికిన నాంది..

-

అల్లరి నరేష్ కి చాలా కాలం తర్వాత హిట్ వచ్చింది. నాంది సినిమాతో ఎనిమిదేళ్ళ తర్వాత విజయం అందుకున్నాడు. సుడిగాడు తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం రాకపోయింది. కానీ నాంది సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమాకి డిజిటల్ లో భారీ ఆఫర్లు వస్తున్నాయి. హిట్ టాక్ తెచ్చుకోవడంతో డిజిటల్ రైట్స్ కి భారీగా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా వందశాతం తెలుగు కంటెంట్ అందిస్తున్న ఆహా, నాంది సినిమాకి భారీ ఆఫర్ ఇవ్వడానికి రెడీ అయ్యిందట.
2.25కోట్ల బడ్జెయ్ పెట్టి మరీ డిజిటల్ రైట్స్ కొనుక్కోవాలని చూస్తుందట. ఇంత రేటంటే నాంది సినిమాకి మంచి లాభమే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కరోనా లాక్డౌన్ ఉన్నప్పటికీ ఓటీటీ నుండి భారీ ఆఫర్లే వచ్చినప్పటికీ, థియేటర్లలోనే విడుదల చేస్తామని ఆగడం మంచిదయింది. లేకుంటే నరేష్ హిట్ వచ్చుండేది కాదు. నిర్మాతకి లాభాలు వచ్చేవి కావు.

 

Read more RELATED
Recommended to you

Latest news