ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేసింది. ఇక ఏం ఫర్వాలేదు. కరోనాతో భయం పోయిందని అనుకుంటున్న సమయంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనని పెంచుతుంది. మనదేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుండి తప్పించుకోవడానికి మళ్ళీ పాత పద్దతినే అమలు చేస్తున్నారు. అమరావతి, అకోలా తదితర నగరాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు.
తాజా సమాచారం ప్రకారం లాక్డౌన్ ని మరో వారం రోజుల పాటు పెంచాలని డిసైడ్ అయ్యారట. మార్చి 8వ తేదీ వరకు లాక్డౌన్ ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, అకోలా, అకోట్, ముర్జితాపూర్ ప్రాంతాలు మరో వారం రోజుల పాటు లాక్డౌన్ లో ఉండనున్నాయి. దేశమంతా కేసులు తగ్గుతున్న వేళ, మహారాష్ట్రలో కేసుల పెరగడం ఆందోళనకరంగా మారింది. కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుండి తమ రాష్ట్రానికి వచ్చే వారికి ఖచ్చితంగా నెగెటివ్ రిపోర్ట్ ఉండాలని అడుగుతుంది.