సిల్వర్ స్క్రీన్ పైన నానిని చూసిన ప్రతీ సారి బాయ్ నెక్స్ట్ డోర్ అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయనకు నేచురల్ స్టార్ అని పేరొచ్చింది కూడా. అలా అందరికీ కనెక్ట్ అయ్యే పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినీ పరిశ్రమలో ఏర్పరుచుకున్నారు.
తెలుగు ప్రేక్షకులకు చివరగా ఆయన ‘శ్యామ్ సింగరాయ్ ’చిత్రంలో కనిపించాడు. త్వరలో ప్రేక్షకులను ‘అంటే సుందరానికీ’ ఫిల్మ్ తో అలరించనున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే నాని తాజాగా నయా అవతారమెత్తారు. అయితే, అది సినిమా కోసం కాదండోయ్.. సౌతిండియాలో నెంబర్ వన్ దుస్తుల బ్రాండ్‌గా పేరుగాంచిన ఒట్టో నాణ్యమైన ఉత్పత్తి ‘మినిస్టర్ వైట్’కు నాని ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నారు.
ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే నాని ఈ బ్రాండ్ కమర్షియల్ యాడ్ ను ఆవిష్కరించారు. అందులో నాని చాలా కొత్తగా కనిపించారు.‘నేచురాలిటీకి ఐడెంటిటీ మన నాని.. అలాగే ఇక నుంచి ట్రెడిషనల్ ఐడెంటిటీకి మినిస్టర్ వైట్’ అంటూ ప్రచారం షురూ చేశారు. ఫేమస్ యాడ్ డైరెక్టర్స్ శంకర్ – గుణ ఈ కమర్షియల్ యాడ్ కు దర్శకత్వం వహించారు.
యాడ్ లో నాని సంప్రదాయ వస్త్రాలు ధరించి, పొడవాటి జుట్టు, గుబురు గడ్డం మీసాలతో కనిపించి ఆకట్టుకుంటున్నారు. యాడ్ లో నాని డైలాగ్స్ నేచురల్ గా ఉన్నాయని యాడ్ చూసిన వారు, అభిమానులు అంటున్నారు.
‘ఆ లుక్ .. అందులో ఓ కిక్’ అని చెప్పే హుక్ డైలాగ్ బాగుందని చెప్తున్నారు. ‘మినిస్టర్ వైట్’ ప్రమోషనల్ యాడ్ వెరీ డిఫరెంట్ గా ఉందనే కాంప్లిమెంట్స్ సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన నాని ‘అంటే సుందరానికీ’ ఫిల్మ్ జూన్ 10న విడుదల కానుంది.