మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగ అఖండమైన ఆదరణ లభిస్తోంది. ఈ ఫిల్మ్ చూసి సినీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. థియేటర్లలో జనం ఈలలు కొడుతూ మూవీని సెలబ్రేట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డులన్నిటినీ తిరగరాస్తోంది ఈ చిత్రం. విదేశాలలో సైతం ఈ పిక్చర్ చూసి జనం సంతోషపడుతున్నారు.
కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే రేర్ రికార్డ్స్ క్రియేట్ చేసిన RRR.. తాజాగా మరో అరుదైన రికార్డును సృష్టించింది. అదేంటంటే..ఫేమస్ ఇంటర్నేషనల్ డేటా బేస్ సంస్థ ఐఎండీబీ.. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టాప్ ఐదు చిత్రాల్లో స్థానాన్ని సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్ ఫిల్మ్. అలా పొజిషన్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మూవీగా RRR అరుదైన ఘనతను సాధించింది.
ఈ పిక్చర్ కు హాలీవుడ్ ఫిల్మ్స్ ను మించిన రేటింగ్ దక్కడం విశేషం.
ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్స్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటించారు. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్స్ గా ఒలివియా, ఆలియా భట్ నటించారు. కీలక పాత్రలను సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా సరణ్ పోషించారు. ఎం.ఎం.కీరవాణి చిత్రానికి సంగీతం అందించారు. 1930ల నేపథ్యంలో తెరకెక్కిన ఫిక్షనల్ స్టోరిలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు.