ఆయన ధైర్యంగా ఉంటారు.. చంద్రబాబుతో ములాఖత్‌ తరువాత భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ ఏపీలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. స్కిల్‌ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్‌లో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే.. ఇవాళ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు కలిశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నారా భువనేశ్వరి వీడియోను విడుదల చేశారు. టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలంతా మా బిడ్డలేనని అన్నారు. టీడీపీ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరిగ్గా లేదన్నారు. చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురి చేయలేరన్నారు నారా భువనేశ్వరి.

చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, ఆయనను ఎవరూ క్షోభకు గురి చేయలేరన్నారు. ఆయన ధైర్యంగా ఉంటారన్నారు. చంద్రబాబు అరెస్టును మహిళలు నిరసన తెలుపుతుంటే వారిపట్ల కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంటే ఏపీలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ కుటుంబానికి చంద్రబాబు పెద్ద అని, పోలీసులు ఏం చేసినా కార్యకర్తలైన టీడీపీ పిల్లలు బెదరరన్నారు.

చంద్రబాబు చేతితో ప్లేట్ పట్టుకొని భోంచేస్తున్నారని, ఆయన భోంచేయడానికి కనీసం టేబుల్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు భోంచేయడానికి టేబుల్ ఇవ్వడానికి తమ లాయర్ అనుమతి కోసం లెటర్ పెట్టవలసి వచ్చిందన్నారు. అనుమతిచ్చాకే టేబుల్ ఇచ్చారని, అలా ఆయనను మానసిక క్షోభకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ఆయన ధైర్యంగా ఉంటారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news