ముదురు హీరోల‌తో వ‌గ‌రు ప్రేమ? ఎప్పుడంటే?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోయిన్ లకు మధ్య వయస్సు తేడా ఉండడం అనేది సర్వసాధారణం. అలాగే తెలుగు సినిమాలలో కూడా ఎంతోమంది హీరోలకు, హీరోయిన్ లకు మధ్య చాలా వయస్సు తేడా ఉన్నప్పటికీ సినిమాలలో వారు కలిసి నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించారు. వాళ్ళలో కొంతమంది హీరోయిన్ ల గురించి తెలుసుకుందాం…

మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. ఆ సినిమా సమయానికి మహేష్ బాబు, రష్మిక మందన కు 21 సంవత్సరాల వయసు తేడా ఉంది.

నాగార్జున హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా గ్రీకు వీరుడు. ఈ సినిమా సమయానికి నాగార్జునకు నయనతారకు మధ్య ఇరవై ఐదు సంవత్సరాల వయసు తేడా ఉంది.

వెంకటేష్, అంజలి హీరో, హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 26 సంవత్సరాల వయసు తేడా ఉంది.

రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా. ఈ సినిమాలో నబా నాటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సమయానికి వీరిద్దరి మధ్య 27 సంవత్సరాల వయసు తేడా ఉంది.

బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించిన సినిమా అఖండ. ఈ సినిమా సమయానికి ఈ ఇద్దరు మధ్య 31 సంవత్సరాల వయసు తేడా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా కలిసి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సమయానికి వీరిద్దరి మధ్య ముప్పై నాలుగు సంవత్సరాల వయసు తేడా ఉంది.