టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట పాదయాత్ర చేసున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే.. నేడు ఒంగోలులో లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర సందర్బంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ వైసీపీపై విరుచుకుపడ్డారు. బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశామన్న ఆయన, జగన్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని ఎద్దేవా చేశారు.
‘‘జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక కటింగ్, ఫిటింగ్ మాస్టర్, జగన్ దగ్గర రెండు బటన్లు ఉంటాయి. బల్లపైన బ్లూ బటన్, బల్లకింద రెడ్ బటన్. భారత దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు ఆయనే’’ అంటూ లోకేశ్ మండిపడ్డారు.
మహిళలకు ఇచ్చిన ఏహామీనీ జగన్ నెరవేర్చలేదని లోకేశ్ ఆరోపించారు. మహిళ కన్నీరు తుడిచే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు లోకేశ్.