తెలుగురాష్ట్రాల్లో కరోనా తీవ్రత రోజరోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి టైమ్‌లో బార్డర్ల దగ్గర అంబులెన్సులను పోలీసులు ఆపడం నిజంగా దారుణమనే చెప్పాలి. ఎందుకంటే వారు ఆపినంత సేపు రోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఏ మాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
ఇక ఇదే విషయంపై హైకోర్టు కూడా పదే పదే చెబుతున్నా అధికారులు మాత్రం తమ పంథా మార్చుకోవట్లేదు. దీంతో తాజాగా ఈ అంశంపై నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
అసలు అంబులెన్సులు ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదని మండి పడ్డారు. ఏపీలో మంచి వైద్యం అందితే జనాలు పక్క రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారంటూ వైసీపీపై కౌంటర్ వేశారు. ఈ రాష్ట్రంలో వైద్యం అందదు, వేరే రాష్ట్రానికి వెళ్లడానికి వీలు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీ పేషెంట్లను బార్డర్ల వద్ద ఆపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.