భూరక్ష కాదు జగన్ రెడ్డి భూ భక్ష – నారా లోకేష్

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేడు 6వ రోజుకి చేరింది. నేడు పలమనేరు నియోజకవర్గంలోని కమ్మనపల్లె కస్తూర్భా స్కూల్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. బైరెడ్డిపల్లి మండలం లో చెరుకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నారా లోకేష్. టిడిపి అధికారంలోకి వచ్చాక చెరుకు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

అలాగే నక్కపల్లి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన భూముల రి సర్వే సరిహద్దు రాళ్ళను లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భూముల రి సర్వే పేరుతో భారీ స్కాం జరుగుతుందని ఆరోపించారు. జగన్ రెడ్డి భూములు కొట్టేస్తున్నాడని.. అది భూ రక్ష కాదు జగన్ రెడ్డి భూ బక్ష అని అన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు నారా లోకేష్. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న భూముని డ్రోన్ సర్వే పేరుతో వైసిపి ప్రభుత్వం దోచుకోవాలని చూస్తుందని ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి దోచుకున్న భూమిని ప్రజలకు తిరిగి ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news