ల‌క్ష‌లాది కార్య‌క‌ర్త‌ల సైన్య‌మే తెలుగుదేశం బ‌లం – నారా లోకేష్

-

ల‌క్ష‌లాది కార్య‌క‌ర్త‌ల సైన్య‌మే తెలుగుదేశం బ‌లం అని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకంగా రాజ‌కీయ చైత‌న్యానికి సంకేతంగాతెలుగుదేశం ఆవిర్భ‌వించి 41 ఏళ్లు అని తెలిపారు. అన్న‌గారి ఆశ‌యాల మేర‌కు అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా నిలిచింది ప‌సుపు జెండా అని కొనియాడారు.
బ‌డుగుబ‌ల‌హీన‌వ‌ర్గాల‌కి భ‌రోసా అయ్యింది. మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న‌కి చేయూత‌నందించిందన్నారు నారా లోకేష్‌.

స‌క‌లరంగాల అభివృద్ధిపైనా టిడిపి సంత‌కం చెర‌గ‌నిది. దేశంలో ఏ రాజ‌కీయ పార్టీకి లేని ల‌క్ష‌లాది కార్య‌క‌ర్త‌ల సైన్య‌మే తెలుగుదేశం బ‌లం అని పేర్కొన్నారు. నంద‌మూరి తార‌క‌ రాముని ఆశీస్సులు, చంద్ర‌న్న దిశానిర్దేశంలో ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్యం.. రాష్ట్రాల ప్ర‌గ‌తే ధ్యేయంగా ద‌శాబ్దాలుగా సాగుతోంది తెలుగుదేశం ప్ర‌యాణం. నేను తెలుగువాడిన‌ని సంతోషిస్తాను. నేను తెలుగుదేశం వాడిన‌ని గ‌ర్వి స్తాను. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news