సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

-

సిఎం జగన్ కు టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాశారు లోకేష్. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం ఏర్పడిందని… అప్పులు చేసి పెట్టుబ‌డులు పెట్టి, ఇంటిల్లిపాదీ శ్రమించి పండించిన‌ పంట చేతికందే సమయంలో వర్షాలకు నీటిపాలై తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

ys jagan on nara lokesh

పెద్ద ఎత్తున పెరిగిన పెట్టుబడి వ్యయంచేసి పండించిన పంటని అకాల‌వ‌ర్షాలు మింగేశాయని… ప్రభుత్వం రైతుకు వరికి హెక్టారుకు రూ.25 వేలు, చెరకు రూ.30 వేలు, పత్తికి రూ.25 వేలు, జొన్నకు రూ.15 వేలు, కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, ఆక్వాకు హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందించాలని దెమాద చేశారు. ఎటువంటి షరతులు లేకుండా పూర్తి మొత్తం చెల్లించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. నామ్‌కే వాస్తేగా ఉన్న రైతుభ‌రోసా కేంద్రాలు రైతుల‌కు అండ‌గా నిలిచే కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. పంట‌న‌ష్ట‌ప‌రిహారం లెక్కింపు రైతుల‌కి దూరంచేస్తోన్న నిబంధ‌న‌లను స‌వ‌రించి, న‌ష్ట‌పోయిన ప్ర‌తీరైతూ-కౌలు రైతుకీ సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news