బూతు గేమ్స్, పబ్జీ గేమ్ తప్ప.. మిగతా క్రీడలకు విలువ లేదా జగన్ రెడ్డీ అంటూ నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉందని జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. అటువంటప్పుడు రాష్ట్రం నుండి నేషనల్ గేమ్స్ లో పాల్గొంటున్న సుమారు 300 మంది క్రీడాకారులు, కోచ్ లు & మేనేజర్లకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్ రెడ్డి? అని నిలదీశారు.
నేషనల్ గేమ్స్ కు వెళ్తుంటే క్రీడాకారులకు కనీసం ఒక్కరోజు శిక్షణ కూడా ఇవ్వలేదని, గుజరాత్ వెళ్లేందుకు క్రీడాకారుల ప్రయాణానికి రిజర్వేషన్లు కూడా చేయించలేదని అంటున్నారు. దొంగాటలు, దోపిడీ ఆటలు, బూతు గేమ్స్, మీరు ఆడుకునే పబ్జీ గేమ్ తప్ప మీ దృష్టిలో మిగతా క్రీడలకు విలువ లేదా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. ఎలాగూ మీరు, మీవాళ్లు ఏపీ పరువు తీస్తున్నారు. కనీసం క్రీడాకారులను ప్రోత్సహిస్తే… వారన్నా పోయిన రాష్ట్రం పరువు కాపాడి తెచ్చే వీలుంది కదా! కాబట్టి వెంటనే వారికి నిధులు మంజూరు చేసి… వాళ్ళంతా ఆత్మవిశ్వాసంతో పోటీల్లో పోరాడేలా ప్రోత్సహించాలని కోరారు నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉందని జగన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చెప్పారు. అటువంటప్పుడు రాష్ట్రం నుండి నేషనల్ గేమ్స్ లో పాల్గొంటున్న సుమారు 300 మంది క్రీడాకారులు, కోచ్ లు & మేనేజర్లకు ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు జగన్ రెడ్డి? pic.twitter.com/DPWR6Fl8Sn
— Lokesh Nara (@naralokesh) September 17, 2022