కొంపలో కూర్చుని తప్పుడు కేసులు పెడతావా…?

క‌రోనా పేషెంట్ల‌కు క‌నీస‌వైద్య‌సేవ‌లు అంద‌డంలేద‌ని కాకినాడ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూసైనా మాన‌వ‌త్వంతో స్పందించండి జగన్ రెడ్డి గారూ అని ట్వీట్ చేస్తే.. నాపై ఫేక్ కేసులు పెట్టించారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేసారు. ఆస్ప‌త్రిలో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దేందుకు మాత్రం చ‌ర్య‌లు తీసుకోలేదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కాకినాడ రమణయ్యపేట ప్రాంతానికి చెందిన వ‌లంటీర్ లక్ష్మి ఏడు నెల‌ల గ‌ర్భిణి.. ఆమెకు కోవిడ్ సోకి కాకినాడ ప్ర‌భుత్వ ఆస‌త్ప్రిలో చేరారు అని…

త‌న‌కు వైద్యం అంద‌డంలేద‌ని సెల్ఫీ వీడియోలో వేడుకున్నారు అని లోకేష్ వివరించారు. క‌లెక్ట‌ర్ ఆదేశించినా వైద్యం అంద‌క ఆమెతోపాటు క‌డుపులో బిడ్డ కూడా క‌న్నుమూసింది అని అన్నారు. వ‌లంటీర్‌తోపాటు ఆమె క‌డుపులో ఉన్న ప‌సిగుడ్డు మ‌ర‌ణానికి మీ చేత‌కాని పాల‌న కార‌ణం కాదా? అని ఆయన నిలదీశారు. జ‌గ‌న్‌రెడ్డి గారూ! ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి కొంప‌లో కూర్చుని ప్ర‌తిప‌క్షంపై ఎలా త‌ప్పుడు కేసులు పెట్టాల‌నే కుతంత్రాలు మానేసి, ప్ర‌జ‌ల ప్రాణాలు ఎలా కాపాడాల‌నే దానిపై స‌మీక్ష‌లు చేయండి మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి గారూ! అంటూ సూచించారు.