ఈరోజు ఏపీలోని షీ టీమ్ లకు ద్విచక్ర వాహనాలు అందచేశారు గుంటూరు అర్చన్ ఎస్పీ. అయితే పాత వాహనాలకు వైకాపా రంగులు వేసి షీ టీమ్ లకు అందచేశారని ప్రచారం జరుగుతోంది. జగన్ జన్మదినం రోజున వైకాపా రంగులతో కూడిన వాహానాలు ప్రారంభం కావడం చర్చనీయాంశం కావడంతో దాని మీద ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శలు చేశారు.
పోలిసు వాహనాలకు వైకాపా రంగులా! పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు అని అయన విమర్శించారు. రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకి రాగలుగుతారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది అంటూ ఆయన ట్వీట్ చేశారు.