సీఎం జగన్‌పై లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు

-

అమరావతి: నీళ్లు పారే రాయలసీమలో మళ్లీ రక్తం పారటానికి కారణం జగన్ రెడ్డినని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తపాతం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగ క్యాలెండర్ ఓ ఫేక్ క్యాలెండర్ అని రుజువైందన్నారు. 2.30లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఓ ముఖ్యమంత్రిని కాల్చమని, చొక్కాపట్టుకోమని, చెప్పుతో కొట్టమని జగన్ రెడ్డిలా తానైతే చెప్పలేదని తెలిపారు.

రాష్ట్రంలో పరీక్షలు నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమమని, 80లక్షల మందికి దీని ద్వారా ముప్పు పొంచి ఉందని లోకేశ్ అన్నారు. దేశంలో పరీక్షలు రద్దు చెయ్యని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వ్యాఖ్యానించారు. ఓ తండ్రిలా ఆలోచించా కాబట్టే విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు పరీక్షలు రద్దు చేయమని 2నెలలుగా పోరాటం చేస్తున్నానన్నారు. కరోనా తీవ్రతలో దేవాన్ష్ పరీక్షలు రాయాల్సి వస్తే పరిస్థితేంటని ఆవేదన చెందే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని రద్దు డిమాండ్ చేశామని లోకేశ్ తెలిపారు.

మొండితనంతో 15లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం ప్రభుత్వానికి తగదని లోకేశ్ వ్యాఖ్యానించారు. దేశమంతా ఒక దారిలో వెళ్తుంటే అందుకు విరుద్ధంగా జగన్ రెడ్డి వైఖరి సరికాదని సూచించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనల దృష్ట్యా తక్షణమే పరీక్షలు రద్దు చెయ్యాలని లోకేశ్ డిమాండ్ చేశారు. పరీక్షలు రద్దు నిర్ణయాన్ని వెంటనే అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టుకి తెలపాలని సూచించారు. పరీక్షల రద్దుకు మద్దతు తెలిపిన దాదాపు 7లక్షల మంది అభిప్రాయాలను ముఖ్యమంత్రి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చే

Read more RELATED
Recommended to you

Latest news