ఎల్కే అద్వానీని కలిసిన నరేంద్ర మోడీ… ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

-

బీజీపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ఇంటికెళ్లిన మోదీ కాసేపు ఆయనతో మాట్లాడారు. పుష్ఫగుచ్చం ఇచ్చి అద్వానీ ఆశీర్వాదం తీసుకున్నారు .జూన్ 9న జరిగే ప్రమాణ స్వీకారానికి అద్వానీని ఆహ్వానించారు మోదీ. ఇక అక్కడి నుంచి మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఇంటికి బయల్దేరారు మోదీ.

ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవన్ లో ఇవాళ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఇందులో మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్డీయే పక్ష నేతగా మోడీ పేరును రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, నితిన్ గడ్కరీ, కుమారస్వామి, చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ బలపరిచారు.తర్వాత మోడీ తనకు మూడో సారి అవకాశం కల్పించినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత మోదీ శనివారమే ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి . కాని తాజాగా ఆ ప్రోగ్రామ్ను ఆదివారం సాయంత్రానికి మార్చారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో సారి పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండో నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news