నరసాపురం ఉపపోరు: రాజుగారి ప్రత్యర్ధి ఫిక్స్?

-

ఇంతవరకు వైసీపీని ఇరుకున పెడుతూ వస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు…వైసీపీకి మరింతగా చెక్ పెట్టడానికి సరికొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్న విషయం తెలిసిందే. వైసీపీలో గెలిచి ఇంతకాలం అదే పార్టీపై విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామ..ఇంకా తాను రాజీనామా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 5 వరకు వైసీపీకి ఛాన్స్ ఇస్తున్నానని, దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలంటే…లేదంటే వైసీపీకి దమ్ము లేదని చెప్పి తానే రాజీనామా చేస్తానని అన్నారు.

అయితే ఎలా వచ్చిన రాజు గారు రాజీనామా చేయడం ఖాయమనే చెప్పొచ్చు. అందుకే ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి చూస్తున్నారు. ఇక నరసాపురం ఉపఎన్నిక వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా రఘురామ క్లారిటీ గానే ఉన్నారు. ఇప్పటికే ఆయన బీజేపీలో చేరి టీడీపీ-జనసేనల మద్ధతుతో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. లేదంటే ఇండిపెండెంట్‌గా బరిలో దిగి మూడు పార్టీల మద్ధతు తీసుకుంటారని తెలిసింది.

ఇదే క్రమంలో ఆయనకు అపోజిట్‌లో వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో దింపడానికే వైసీపీ కూడా సిద్ధమవుతుందని తెలిసింది. ఇప్పటికే అభ్యర్ధిని రెడీ చేసి పెట్టుకున్నారని సమాచారం. ఇదే క్రమంలో తాజాగా ఓ న్యూస్ డిబేట్‌లో రఘురామ తన ప్రత్యర్ధి ఎవరు అనే విషయంపై స్పందిస్తూ..వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగిన తన ప్రత్యర్ధి మాత్రం జగనే అని చెబుతున్నారు. ఆయనని ప్రత్యర్ధిగా అనుకునే తాను బరిలో దిగుతున్నానని అన్నారు.

అదే సమయంలో నరసాపురంలో ఏ పిల్ల కాకి బరిలో దిగిన విజయం మాత్రం తనదే అని అంటున్నారు. దీని బట్టి చూస్తే తనపై పోటీ చేసే ప్రత్యర్ధి ఎవరో కూడా రాజు గారికి ఐడియా ఉన్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నేత గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు వైసీపీ నుంచి పోటీ చేయొచ్చని ప్రచారం ఉంది. ఇక ఆయన్ని ఉద్దేశించే రఘురామ కామెంట్ చేశారని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. చూడాలి మరి రఘురామ ప్రత్యర్ధిగా ఎవరు బరిలో దిగుతారో.

Read more RELATED
Recommended to you

Latest news