నేడు మానవరహిత ఆర్టెమిస్‌-1 ప్రయోగం

-

మానవుడి విశ్వాన్వేషణలో చరిత్రాత్మక ఘట్టానికి ఇవాళ శ్రీకారం చుట్టుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. గతంలోలా నామమాత్రపు సందర్శనలతో సరిపుచ్చకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేయనుంది. లోతైన పరిశోధనలకు వేదిక ఏర్పాటు చేయనుంది.

అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు మాత్రం మానవసహితంగానే సాగుతాయి.

ఇవాళ పంపే ఆర్టెమిస్‌-1 లోని కమాండర్‌ సీటులో ఒక మనిషి బొమ్మ ఉంటుంది. దానికి ఫ్లైట్‌ సూట్‌ను తొడిగారు. రేడియోధార్మికత నుంచి ఇది ఎంత మేర వ్యోమగామిని రక్షిస్తుందన్నది పరిశీలిస్తారు. ఇది కాక హెల్గా, జోహర్‌ అనే రెండు బొమ్మలు కూడా ఒరాయన్‌లో ఉంటాయి. మానవ కణజాలాన్ని సిమ్యులేట్‌ చేసే పదార్థంతో వీటిని తయారుచేశారు. ఇవి సుదూర అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేస్తాయి.

గ్రీక్‌ పురాణాల ప్రకారం ఆర్టెమిస్‌ ఒక దేవత. జ్యూస్‌ కుమార్తె. అపోలోకు కవల సోదరి. ఆర్టెమిస్‌ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది.

  • ప్రాజెక్టు వ్యయం: 9300 కోట్ల డాలర్లు
  • ఆర్టెమిస్‌-1 ఖర్చు: 400 కోట్ల డాలర్లు
  • 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్‌-1 ప్రయాణించే దూరం: 13 లక్షల కిలోమీటర్లు
  • జాబిలిపై ఇప్పటి వరకూ కాలుమోపిన మానవులు: 12 మంది

Read more RELATED
Recommended to you

Latest news