సన్ రైజర్స్ ఆటగాడిపై సినిమా తీసేందుకు ఉవ్విళ్ళూరున్న నిర్మాతలు..

-

గత ఏడాది ఐపీఎల్ లో అనూహ్యంగా మెరిసిన క్రికెటర్లలో సన్ రైజర్స్ ఆటగాడు నటరాజన్ ఒకరు. తన యార్కర్లతో సన్ రైజర్స్ ఆటలో కీలక పాత్ర పోషించిన నటరాజన్, ఆ వెంటనే ఇండియా టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో నటరాజన్ తనదైనా ఆటతో అందరి దృష్టికి వచ్చాడు. ఐతే ఈ ఆటగాడి జీవితంపై సినిమా నిర్మాతలు బయోపిక్ నిర్మించాలని అనుకుంటున్నారు. నటరాజన్ మిడిల్ క్లాస్ కి చెంది వ్యక్తి. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు.

చిన్నగదిలో సరిగా పడుకోవడానికి కూడా చోటు ఉండేది కాదట. అంతటి బీదరికం నుండి దేశానికి ఆడే ఆటగాడిగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. ఐతే తనపై సినిమా తీస్తానని వస్తున్న నిర్మాతలకి నటరాజన్ వద్దని చెబుతున్నాడని సమాచారం. ఇప్పుడిప్పుడే దేశానికి ఆడుతున్నానని, ఇంకా ఏమీ సాధించలేదని వద్దంటున్నాడట. ఐతే ఎప్పటికైనా నటరాజన్ జీవితంపై ఒక సినిమా వస్తే చాలా మందికి ప్రేరణగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news