దేశం తెలంగాణ రాష్ట్ర పథకాల వైపు చూస్తుందన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణలో ఏ అభివృద్ది జరగుతుందో పక్క రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో చర్చ జరగాలన్నారు. రైతు బందు పెట్టడం వల్ల 8 రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ 12 రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నారని తెలిపారు. మిషన్ కాకతీయ ను ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. కంటివెలుగును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెల్లాలన్నారు బాల్క సుమన్.
ప్రపంచంలోనే అతి ఎక్కువ మందికి నేరుగా లబ్ధి చేకూర్చిన పథకం కంటి వెలుగు పథకం అని.. ఇప్పటివరకు తెలంగాణలో 1.54 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలను అందించడం జరిగిందన్నారు. మొదటి విడతలో కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి 100 రోజుల్లోనే తెలంగాణలో పూర్తిస్థాయిలో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 200 కోట్లు కేటాయించామని.. రాష్ట్రంలో 1500 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.