జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ఊడిగం చేస్తున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదన్నారు. అసలు జనసేన పార్టీ పుట్టిందే చంద్రబాబు కోసం అన్నారు అంబటి రాంబాబు. ప్యాకేజీ తీసుకొని చంద్రబాబును పవన్ కళ్యాణ్ భజనచేస్తాడని సీఎం జగన్ రెండు మూడేళ్ల క్రితమే చెప్పారని అన్నారు. వాళ్ళిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాకుండా టిడిపి పరిరక్షణ గురించి చర్చించుకున్నారని ఆరోపించారు.
ఈ ఎపిసోడ్ లో ఆశ్చర్యపోవాల్సింది బిజెపి పార్టీ అని అన్నారు. ఇది చూసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని నమ్మే అమాయకులు ఆశ్చర్యపోవాలన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలిసినా మాకు ఎటువంటి నష్టం లేదని.. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్సిపి 175 సీట్లకు 175 గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.