యాదాద్రి, వర్గల్‌ ఆలయాలకు జాతీయ స్థాయి గుర్తింపు

-

రాష్ట్రంలోని రెండు ప్రసిద్ధ ఆలయాలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మరో బాసరగా వర్దిల్లుతున్న వర్గల్‌ శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జాతీయ సర్టిఫికెట్‌ బ్లిస్‌ ఫుల్‌ హైజీన్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌ (భోగ్‌) గుర్తింపు లభించింది. దేశంలో 70కి పైగా దేవాలయాలు ఈ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తెలంగాణలోని యాదాద్రి, సిద్దిపేట జిల్లా వర్గల్‌ దేవాలయాలకు ఈ గుర్తింపు దక్కింది.

కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్‌ బృందం కొద్ది రోజుల క్రితం యాదాద్రి, వర్గల్‌ దేవాలయాలను సందర్శించి నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, వంటగది నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, ఈ క్రమంలో పాటిస్తున్న శుచి, శుభ్రత అంశాలపై పరిశీలించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్‌ గుర్తింపునకు రిఫర్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news