టీకాల పంపిణీలో భారత్ రికార్డు

-

దేశంలో రెండోసారి కరోనా విజృంభించడంతో క్రమంగా అన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం టీకాను కూడా అంతే వేగంగా పంపిణీ చేస్తుంది. కాగా కోవిడ్ టీకా విషయంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవ‌లం 95 రోజుల్లోనే 13 కోట్ల మంది కోవిడ్ టీకా ఇచ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ‌ శాఖ బుధవారం వెల్ల‌డించింది. అమెరికా, చైనా దేశాలు టీకా పంపిణీలో భారత్ కంటే వెనుకబడే ఉన్నాయి. అమెరికా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి 101 రోజులు పట్టగా.. చైనా 109 రోజుల్లో 13 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమయం కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ‌ శాఖ తెలిపింది.

ఇప్ప‌టి వ‌ర‌కు భారత్ లో 13,01,19,310 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతుండగా… గ‌త 24 గంట‌ల్లోనే 29,90,197 మందికి టీకా ఇచ్చారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌,మ‌హారాష్ట్ర‌, రాజ‌స్తాన్‌, గుజ‌రాత్‌, బెంగాల్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, కేర‌ళ రాష్ట్రాలు 59.33 శాతం డోసుల‌ను ఇచ్చిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.

కాగా మన దేశంలో జ‌న‌వ‌రి 16వ తేదీన ఈ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైన విష‌యం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వగా… ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, మార్చి ఒక‌టో తేదీ నుంచి 60 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత ఏప్రిల్ ఒక‌టి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news