టార్గెట్ మోదీ.. ఏకతాటిపైకి 18 ప్రతిపక్ష పార్టీలు

-

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా 18 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో 18 పార్టీల సభాపక్ష నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత విధించటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌, DMK, NCP, JDU, BRS, TMC, ఆమ్ ఆద్మీ, CPM, CPI, MDMK, KC, RSP, RJD, జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, IUML, VCK, ఎస్పీ, JMM నేతలు పాల్గొన్నారు.

ఈ భేటీలో అదానీ వ్యవహారంపై జేపీసీ ఏర్పాటు, రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు అంశాలపై.. సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ఒక్క వ్యక్తిని కాపాడటం కోసం ప్రధాని మోదీ 140కోట్ల మంది ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రధాని పరమమిత్రున్ని కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ.. ప్రజా సమస్యలను చర్చించాల్సిన పార్లమెంటు సమావేశాలను సాగనివ్వటం లేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news