ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ కి చరిత్రలో ఎప్పుడు లేనంత వరద వస్తోందని తెలిపారు. నాలుగు బోట్లు ఢీ కొనడంతో 69వ ఖానా వద్ద కొంత డ్యామేజ్ అయింది. దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ కి ఏమి ఇబ్బంది లేదు అని మంత్రి వెల్లడించారు.
గేటు ను కిందకు దింపటం చేయవచ్చు. వరద తగ్గిన తర్వాత గేటును కిందకు దించాక వరద వస్తే మళ్ళీ గేటు ఎత్తటం ఇబ్బంది అవుతుంది. అందుకే వరద తగ్గిన వెంటనే మరమ్మత్తు చర్యలు చేస్తామని తెలిపారు. బుడమేరు గండి పడిన చోట కూడా అప్రోచ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరద ఇవాళ తగ్గుముఖం పడుతుంది. నగర వాసులు ఆందోళన చెందవద్దని కోరుతున్నాను. పరిస్థితిని అదుపులోకి వచ్చే వరకు సీఎం చంద్రబాబు ఇక్కడే ఉంటారని మంత్రి నిమ్మల వెల్లడించారు.