ఇదేం విచిత్రం.. మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల

-

బిహార్​ గోపాల్​గంజ్​ జిల్లాలోని సింధ్​వలియా ప్రాంతంలోని తెగ్రహి గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వీధి కుక్కు ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో వింత ఏముంది అంటారా. ఆగండాగండి.. అక్కడికే వస్తున్నా. ఎనిమిది పిల్లలు పుట్టడం వింత కాదు.. ఆ పిల్లల్లో ఓ కుక్క పిల్ల వింతగా ఉంది. అచ్చం మేక పోలికలు కలిగి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దాన్ని మేక పిల్లగా భావించిన అదే గ్రామనికి చెందిన శంభు దాస్ అనే వ్యక్తి దాన్ని తన ఇంటికి తీసుకువెళ్లాడు. అది మేక కాదని తెలిసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆ బుజ్జి కుక్కపిల్లను చూడటానికి బారులు తీరుతున్నారు.

‘ఓ వీధి కుక్క పెట్టిన పిల్లల్లో ఓ మేక పిల్లను చూశాను. ఆ మేక పిల్ల ఎవరిదని చుట్టు పక్కల అందర్నీ అడగగా.. ఎవరూ సమాధానం చెప్పలేదు. అందువల్ల నేను నా ఇంటికి తీసుకువెళ్లాను. అయితే కొంత సమయానికి ఓ కుక్క వచ్చి.. బుట్టలో దాచిన కుక్క పిల్లను నోటితో పట్టుకుని తన స్థావరానికి తీసుకెళ్లింది’ అని శింభు దాస్​ తెలిపాడు.

అయితే దీన్నీ క్రాస్​ బ్రీడింగ్​గా భావించి ఆ మేకలాంటి కుక్క పిల్లను శింభు ఇంటి వద్దనే ఉంచి దానికి పాలు అందిస్తున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సంప్రదించారు. అయితే అక్కడకు చేరుకున్న పశువైద్యులు ఇది క్రాస్​ బ్రీడింగ్​ కాదని తేల్చిచెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news