ఆకుల చాటున అందాలు దాచేసిన అమలాపాల్..!

-

మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. కేరళలోని ఎర్నాకులంలో మలయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. కానీ కోలీవుడ్ లో బాగా పాపులారిటీని దక్కించుకుందని చెప్పవచ్చు. అమలాపాల్ అసలు పేరు అనఖ. విద్యాభ్యాసాన్ని కొచ్చి లో పూర్తి చేసిన ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు లాల్ జోనస్ తెరకెక్కించిన నీల తామర సినిమాతో సినీ తెరకు పరిచయమైంది. తమిళ హాస్య చిత్రం వికడకవిలో ఒక పాత్రను పోషించినా.. ఈ సినిమా విడుదల బాగా ఆలస్యం అయింది. ఈ మధ్యలో వీరశేఖరన్ , సింధుసామవేలి అనే తమిళ్ చిత్రాలలో నటించింది.

మైనా చిత్రం ద్వారా విజయం సాధించడంతో అమలాపాల్ కు అవకాశాలు వెల్లువెత్తాయి.అలా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది అమలాపాల్. ఆ తర్వాత తెలుగులో ఇద్దరమ్మాయిలతో, లవ్ ఫెయిల్యూర్ , మేము , జెండాపై కపిరాజు వంటి సినిమాలలో నటించి సత్తా చాటింది.

Imageఅలాగే రఘువరన్ బీటెక్, విఐపి వంటి సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందం, అభినయం ఉన్నా తెలుగులో మాత్రం అవకాశాలు లభించడం లేదు. అందుకే తమిళ్, మలయాళం ఇండస్ట్రీలోకి వెళ్లిపోయిన ఈమె అక్కడ వెబ్ సిరీస్ లో చేస్తూ దూసుకుపోతోంది.

ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆకుల చాటున తన అందాలను పూర్తిగా దాచేసిందనే చెప్పాలి. ఆకుల చాటున దాక్కొని ఒకవైపు నుంచి తన అందాలను చూపిస్తూ మరింతగా పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం అవి కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి . మొత్తానికైతే తన గ్లామర్ ఫోటోస్ మరింత పాపులరిటీ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news