ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి !

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 50 మందితో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు. రికినికల్ – బీరోకల్ రహదారిపై 50 మందితో వెళుతున్న పెళ్లి బస్సు నిన్న రాత్రి అదుపు తప్పి 500 మీటర్ల దిగువన ఉన్న నదిలో పడిపోయింది. ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికి తీశారు.

accident
accident

9 మంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారికోసం రెస్క్యూ టీమ్ సభ్యులు గాలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ” ఈ ప్రమాద ఘటన దురదృష్టకరం. దీనిపై విపత్తు నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడాను. తక్షణ సహాయ చర్యలను వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. బాధితులకు అన్ని విధాల అండగా ఉంటాం”. అని ఆయన ట్వీట్ చేశారు.