టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో అజిత్ అగార్కర్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు… జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ చీఫ్ గా అజిత్ అగర్కర్ నియామకం ఖాయమైనట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ పదవికి అజిత్ రాజీనామా చేయడంతో దీనికి మరింత ఊతమిచ్చింది.
వివాదాలతో చేతన్ శర్మ పదవిని వీడగా… గత కొన్ని నెలలుగా చీఫ్ సెలెక్టర్ పదవి ఖాళీగా ఉంది. అయితే మాజీ కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా…జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ చీఫ్ కోసం ఇవాళ్టి వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి ఇవాళ ఎవరైనా.. జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ చీఫ్ కోసం ఎవరైనా అప్లై చేస్తారా..లేదో చూడాలి.